View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన ఇతరులకు నిను
ఇతరులకు నిను నెరుగదరమా ‖
సతతసత్యవ్రతులు సమ్పూర్ణమోహవిర-
హితులెరుగుదురు నిను నిన్దిరారమణా ‖
నారీకటాక్షపటునారాచభయరహిత-
శూరులెరుగుదురు నిను జూచేటిచూపు |
ఘొరసంసార సఙ్కులపరిచ్ఛేదులగు-
ధీరులెరుగుదురు నీదివ్యవిగ్రహము ‖
రాగభోగవిదూర రఞ్జితాత్ములు మహా-
భాగులెరుగుదురు నిను బ్రణుతిఞ్చువిధము |
ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా-
యోగులెరుగుదురు నీవుణ్డేటివునికి ‖
పరమభాగవత పదపద్మసేవానిజా-
భరణు లెరుగుదురు నీపలికేటిపలుకు |
పరగునిత్యానన్ద పరిపూర్ణమానస-
స్థిరు లెరుగుదురు నిను దిరువేఙ్కటేశ ‖