View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన ఇప్పుడిటు కలగన్టి

రాగం: భూపాళం

ఇప్పుడిటు కలగణ్టి నెల్లలోకములకు |
అప్పడగు తిరువేఙ్కటాద్రీశు గణ్టి ‖

అతిశయమ్బైన శేషాద్రిశిఖరము గణ్టి |
ప్రతిలేని గోపుర ప్రభలు గణ్టి |
శతకోటి సూర్య తేజములు వెలుగగ గణ్టి |
చతురాస్యు బొడగణ్టి చయ్యన మేల్కొణ్టి ‖

కనకరత్న కవాట కాన్తు లిరుగడగణ్టి |
ఘనమైన దీపసఙ్ఘములు గణ్టి |
అనుపమ మణీమయమ్మగు కిరీటము గణ్టి |
కనకామ్బరము గణ్టి గ్రక్కన మేల్కొణ్టి ‖

అరుదైన శఙ్ఖ చక్రాదు లిరుగడ గణ్టి |
సరిలేని యభయ హస్తము గణ్టి |
తిరువేఙ్కటాచలాధిపుని జూడగ గణ్టి |
హరి గణ్టి గురు గణ్టి నన్తట మేల్కణ్టి ‖