View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన ఇన్దరికి అభయమ్బు
రాగం: కామ్భోజి రాగం
ఇన్దరికీ అభయమ్బు లిచ్చు చేయి
కన్దువగు మఞ్చి బఙ్గారు చేయి ‖
వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కిన్ద చేర్చు చేయి |
కలికియగు భూకాన్త కాగలిఞ్చిన చేయి
వలవైన కొనగోల్ల వాడిచేయి ‖
తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరఙ్గ భూ దాన మొసగు చేయి |
మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియిఞ్చు చేయి ‖
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగమ్బు బరపెడి దొడ్డ చేయి |
తిరువేఙ్కటాచల ధీశుడై మోక్షమ్బు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ‖