View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన హరి నామము కడు

హరినామము కడు నానన్దకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా ‖

నళినాక్షు శ్రీనామము
కలిదోషహరము కైవల్యము |
ఫలసారము బహుబన్ధ మోచనము
తలచవో తలచవో మనసా ‖

నగధరు నామము నరకహరణము
జగదేకహితము సమ్మతము |
సగుణ నిర్గుణము సాక్షాత్కారము
పొగడవో పొగడవో పొగడవో మనసా ‖

కడగి శ్రీవేఙ్కటపతి నామము
ఒడి ఒడినే సమ్పత్కరము |
అడియాలం బిల నతి సుఖమూలము
తడవవో తడవవో తడవవో మనసా ‖