View this in:
This stotram is in సరళ తెలుగు. View this in
శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
అన్నమయ్య కీర్తన ఘనుడాతడే మము
ఘనుడాతడే మము గాచుగాక హరి
అనిశము నేమిక నతనికె శరణు ‖
యెవ్వని నాభిని యీ బ్రహ్మాదులు
యెవ్వడు రక్షకుడిన్నిటికి |
యెవ్వని మూలము యీ సచరాచర
మవ్వల నివ్వల నతనికే శరణు ‖
పురుషోత్తముడని పొగడి రెవ్వరిని
కరి నెవ్వడు గాచె |
ధర యెవ్వడెత్తి దనుజుల బొరిగొనె
అరుదుగ మేమిక నతనికె శరణు ‖
శ్రీసతి యెవ్వని జేరి వురమునను
భాసిల్లె నెవ్వడు పరమంబై |
దాసుల కొరకై తగు శ్రీవేంకట
మాస చూపి నితడతనికె శరణు ‖