View this in:
This stotram is in సరళ తెలుగు. View this in
శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
అన్నమయ్య కీర్తన గరుడ గమన గరుడధ్వజ
గరుడ గమన గరుడధ్వజ
నరహరి నమోనమో నమో ‖
కమలాపతి కమలనాభా
కమలజ జన్మకారణిక |
కమలనయన కమలాప్తకుల
నమోనమో హరి నమో నమో ‖
జలధి బంధన జలధిశయన
జలనిధి మధ్య జంతుకల |
జలధిజామాత జలధిగంభీర
హలధర నమో హరి నమో ‖
ఘనదివ్యరూప ఘనమహిమాంక
ఘనఘనా ఘనకాయ వర్ణ |
అనఘ శ్రీవేంకటాధిపతేహం
నమో నమోహరి నమో నమో ‖