View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.

అన్నమయ్య కీర్తన గాలినే పోయ

గాలినే పోయ గలకాలము
తాలిమికి గొంతయు బొద్దులేదు ‖

అడుసు చొరనే పట్టె నటునిటు గాల్లు
గుడుగుకొననే పట్టె గలకాలము |
ఒడలికి జీవుని కొడయడైనహరి
దడవగా గొంతయు బొద్దులేదు ‖

కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె కలుషదేహపుబాధ గలకాలము |
తలపోసి తనపాలి దైవమైన హరి
దలచగా గొంతయు బొద్దులేదు |

శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె
గరిమల గపటాల గలకాలము |
తిరువేంకటగిరి దేవుడైనహరి
దరిచేరా గొంతయు బొద్దులేదు ‖