View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.

అన్నమయ్య కీర్తన ఎండ గాని నీడ గాని

ఎండగాని నీడగాని యేమైనగాని
కొండల రాయడె మాకులదైవము ‖

తేలుగాని పాముగాని దేవపట్టయినగాని
గాలిగాని ధూళిగాని కానియేమైన |
కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి-
నీలవర్ణుడేమా నిజదైవము ‖

చీమగాని దోమగాని చెలది యేమైనగాని
గాముగాని నాముగాని కానియేమైన |
పాములనిన్నిటి మ్రింగె బలుతేజిపై నెక్కు
ధూమకేతువేమో దొరదైవము ‖

పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైన గాని
కల్లగని నల్లిగాని కానియేమైన |
బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడి
మమ్మెల్ల కాలము నేలేటి యింటిదైవము ‖