View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన ఏలే ఏలే మరదలా
ఏలే యేలే మరదలా చాలుజాలు |
చాలును చాలు నీతోడి సరసమ్బు బావ ‖
గాటపు గుబ్బలు గదలగ గులికేవు |
మాటల దేటల మరదలా |
చీటికి మాటికి జెనకేవే వట్టి |
బూటకాలు మానిపోవే బావ ‖
అన్దిన్దె నన్ను నదలిఞ్చి వేసేవు |
మన్దమేలపు మరదలా |
సన్దుకో దిరిగేవి సటకారివో బావ |
పొన్దుగాదిక బోవే బావ ‖
చొక్కపు గిలిగిన్తల చూపుల నన్ను |
మక్కువ సేసిన మరదలా |
గక్కున నను వేఙ్కటపతి కూడితి |
దక్కిఞ్చుకొణ్టివి తగులైతి బావ ‖