View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన ఈ సురలు ఈ మునులు

ఈ సురలీమును లీచరాచరములు |
యిసకలమన్తయు నిది యెవ్వరు ‖

ఎన్నిక నామము లిటు నీవై యుణ్డగ |
యిన్ని నామము లిటు నీవై యుణ్డగ |
వున్నచోటనే నీవు వుణ్డుచుణ్డుగ మరి |
యిన్నిటా దిరుగువా రిది యెవ్వరు ‖

వొక్కరూపై నీవు వుణ్డుచుణ్డగ మరి |
తక్కిన యీరూపములు తామెవ్వరు |
యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుణ్డ |
మక్కువ నుణ్డువారు మరి యెవ్వరు ‖

శ్రీవేఙ్కటాద్రిపై చెలగి నీ వుణ్డగా |
దైవమ్బులనువారు తామెవ్వరు |
కావలసినచోట కలిగి నీవుణ్డగ |
యీవిశ్వపరిపూణు లిది యెవ్వరు ‖