View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.

అన్నమయ్య కీర్తన దేవ దేవం భజే

రాగం: ధన్నాసి

దేవ దేవం భజే దివ్యప్రభావం |
రావణాసురవైరి రణపుంగవం ‖

రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం |
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం ‖

నీలజీమూత సన్నిభశరీరం ఘనవి-
శాలవక్షం విమల జలజనాభం |
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం ‖

పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం |
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతం ‖