View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన చేరి యశోదకు

చేరి యశోదకు శిశు వితడు
ధారుణి బ్రహ్మకు తణ్డ్రియు నితడు ‖

సొలసి చూచినను సూర్యచన్ద్రులను
లలి వెదచల్లెడులక్షణుడు |
నిలిచిననిలువున నిఖిలదేవతల
కలిగిఞ్చు సురలగనివో యితడు ‖

మాటలాడినను మరియజాణ్డములు
కోటులు వోడమేటిగుణరాశి |
నీటగునూర్పుల నిఖిలవేదములు
చాటువనూ రేటిసముద్ర మితడు ‖

ముఙ్గిట జొలసిన మోహన మాత్మల
బొఙ్గిఞ్చేఘనపురుషుడు |
సఙ్గతి మావణ్టిశరణాగతులకు
నఙ్గము శ్రీవేఙ్కటాధిపు డితడు ‖