View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన చన్దమామ రావో

చన్దమామ రావో జాబిల్లి రావో
కున్దనపు పైడి కోర వెన్న పాలు తేవో ‖

నగుమోము చక్కని యయ్యకు నలువ బుట్టిఞ్చిన తణ్డ్రికి
నిగమము లన్దుణ్డే యప్పకు మా నీల వర్ణునికి |
జగమెల్ల నేలిన స్వామికి ఇన్దిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికిమా ముద్దుల మురారి బాలునికి ‖

తెలిదమ్మి కన్నుల మేటికి మఞ్చి తియ్యని మాటల గుమ్మకు
కలికి చేతల కోడెకుమా కతల కారి ఈ బిడ్డకు |
కుల ముద్ధిఞ్చిన పట్టెకు మఞ్చి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిణ్డు వొయ్యారికి నవ నిధుల చూపుల జూసే సుగుణునకు ‖

సురల గాచిన దేవరకు చుఞ్చు గరుడుని నెక్కిన గబ్బికి
నెరవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతల పట్టికి |
విరుల విణ్టి వాని యయ్యకు వేవేలు రూపుల స్వామికి
సిరిమిఞ్చు నెరవాది జాణకు మా శ్రీ వేఙ్కటేశ్వరునికి ‖