View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన చాలదా హరి నామ
రాగము : హంసధ్వని
చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు |
చాలదా హితవైన చవులెల్లను నొసగ ‖
ఇది యొకటి హరి నామ మిన్తైన జాలదా |
చెదరకీ జన్మముల చెరలు విడిపిఞ్చ |
మదినొకటె హరినామ మన్త్రమది చాలదా |
పదివేల నరక కూపముల వెడలిఞ్చ ‖
కలదొకటి హరినామ కనకాద్రి చాలదా |
తొలగుమని దారిద్ర్యదోషమ్బు చెరుచ |
తెలివొకటి హరినామదీప మది చాలదా |
కలుషమ్పు కఠిన చీకటి పారద్రోల ‖
తగువేఙ్కటేశు కీర్తనమొకటి చాలదా |
జగములో కల్పభూజమ్బు వలె నుణ్డ |
సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా |
నగవు జూపులను నున్నతమెపుడు జూప ‖