View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన భావము లోన

రాగం: దేసాక్షి

భావములోనా బాహ్యమునన్దును |
గోవిన్ద గోవిన్దయని కొలువవో మనసా ‖

హరి యవతారములే యఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాణ్డమ్బులు |
హరి నామములే అన్ని మన్త్రములు
హరి హరి హరి హరి యనవో మనసా ‖

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదమ్బులు |
విష్ణుడొక్కడే విశ్వాన్తరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా ‖

అచ్యుతుడితడే ఆదియు నన్త్యము
అచ్యుతుడే యసురాన్తకుడు |
అచ్యుతుడు శ్రీవేఙ్కటాద్రి మీదనిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా ‖