View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.

అన్నమయ్య కీర్తన అంతర్యామి అలసితి

రాగం: శివ రంజని

అంతర్యామి అలసితి సొలసితి |
ఇంతట నీ శరణిదె జొచ్చితిని ‖

కోరిన కోర్కులు కోయని కట్లు |
తీరవు నీవవి తెంచక |
భారపు బగ్గాలు పాప పుణ్యములు |
నేరుపుల బోనీవు నీవు వద్దనక ‖

జనుల సంగముల జక్క రోగములు |
విను విడువవు నీవు విడిపించక |
వినయపు దైన్యము విడువని కర్మము |
చనదది నీవిటు శాంతపరచక ‖

మదిలో చింతలు మైలలు మణుగులు |
వదలవు నీవవి వద్దనక |
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె |
అదన గాచితివి అట్టిట్టనక ‖