View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన అన్ని మన్త్రములు
అన్ని మన్త్రములు నిన్దే ఆవహిఞ్చెను
వెన్నతో నాకు గలిగె వేఙ్కటేశు మన్త్రము ‖
నారదుణ్డు జపియిఞ్చె నారాయణ మన్త్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మన్త్రము |
కోరి విభీషణుణ్డు చేకొనె రామ మన్త్రము
వేరె నాకు గలిగె వేఙ్కటేశు మన్త్రము ‖
రఙ్గగు వాసుదేవ మన్త్రము ధ్రువుణ్డు జపియిఞ్చె
నఙ్గ వింవె కృష్ణ మన్త్ర మర్జునుణ్డును |
ముఙ్గిట విష్ణు మన్త్రము మొగి శుకుడు పఠిఞ్చె
విఙ్గడమై నాకు నబ్బె వేఙ్కటేశు మన్త్రము ‖
ఇన్ని మన్త్రముల కెల్ల ఇన్దిరా నాధుణ్డె గురి
పన్నిన దిదియె పర బ్రహ్మ మన్త్రము |
నన్నుగావ కలిగె బో నాకు గురు డియ్యగాను
వెన్నెల వణ్టిది శ్రీ వేఙ్కటేశు మన్త్రము ‖