View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన అన్దరికి ఆధారమైన

అన్దరికాధారమైన ఆది పురుషుడీతడు
విన్దై మున్నారగిఞ్చె విదురునికడ నీతుడు ‖

సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు
వనజ భవాదులకును దైవమ్బై నతడీతడు |
ఇనమణ్డలమున జెలగేటిహితవై భవుడితడు
మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు ‖

సిరులొసగి యశోదయిణ్ట శిశువైనత డీతడు
ధరనావుల మన్దలలో తగ జరిఞ్చె నీతడు |
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు
ఆరసి కుచేలుని యడుకులు ఆరగిఞ్చెనీతడు ‖

పఙ్కజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు
సఙ్కీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు |
తెఙ్కిగ నేకాలము పరదేవుడైన యీతడు
వేఙ్కటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు ‖