View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన అమ్మమ్మ ఏమమ్మ
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మఙ్గ నాఞ్చారమ్మ |
తమ్మియిణ్ట నలరుకొమ్మ ఓయమ్మ ‖
నీరిలోన తల్లడిఞ్చే నీకే తలవఞ్చీ
నీరికిన్ద పులకిఞ్చీ నీరమణుణ్డు |
గోరికొన చెమరిఞ్చీ కోపమే పచరిఞ్చీ
సారెకు నీయలుక ఇట్టె చాలిఞ్చవమ్మ ‖
నీకుగానే చెయ్యిచాచీ నిణ్డాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెఞ్చీని |
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ‖
చక్కదనములె పెఞ్చీ సకలము గాలదఞ్చి
నిక్కపు వేఙ్కటేశుడు నీకే పొఞ్చీని |
మక్కువతో అలమేల్మఙ్గ నాఞ్చారమ్మ
అక్కున నాతని నిట్టే అలరిఞ్చవమ్మ ‖