View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన అలర చఞ్చలమైన
అలర చఞ్చలమైన ఆత్మలన్దుణ్డ నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమన్దుణ్డ నీ భావమ్బు దెలిపె నీ వుయ్యాల ‖
ఉదాయాస్త శైలమ్బు లొనర కమ్భములైన వుడుమణ్డలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలమ్బైన అఖిలమ్బు నిణ్డె నీ వుయ్యాల ‖
పదిలముగ వేదములు బఙ్గారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణిమ్ప నరుదాయె వుయ్యాల ‖
మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువణ్టి నీ మేనికాన్తికి నిజమైన తొడవాయె వుయ్యాల ‖
పాలిణ్డ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ‖
కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలిమ్పగజేసె నుయ్యాల |
అమరాఙ్గనలకు నీ హాస భావ విలాస మన్దన్ద చూపె నీ వుయ్యాల ‖
కమలాసనాదులకు కన్నుల పణ్డుగై గణుతిమ్ప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేఙ్కటశైలపతి నీకు కడువేడుకై వుణ్డె వుయ్యాల ‖