View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన అదివో అల్లదివో

రాగం: మధ్యమావతి

అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము ‖

అదె వేఙ్కటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము |
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడు డదె మొక్కు డానన్దమయము ‖

చెఙ్గట నదివో శేషాచలమూ
నిఙ్గి నున్న దేవతల నిజవాసము |
ముఙ్గిట నల్లదివో మూలనున్న ధనము
బఙ్గారు శిఖరాల బహు బ్రహ్మమయము ‖

కైవల్య పదము వేఙ్కట నగ మదివో
శ్రీ వేఙ్కటపతికి సిరులైనది |
భావిమ్ప సకల సమ్పద రూపమదివో
పావనముల కెల్ల పావన మయమూ ‖