అన్నమయ్య కీర్తన విశ్వరూపమిదివో
విశ్వరూపమిదివో విష్ణురూపమిదివోశాశ్వతులమైతిమింక జయము నాజన్మము ॥
కొండవంటి హరిరూపు గురుతైన తిరుమలపండిన వృక్షములే కల్పతరువులు ।నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములుమెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము ॥
మేడవంటి హరిరూపు మించైనపైడి గోపురమాడనే వాలిన పక్షుల మరులు ।వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరముయీడమాకు పొడచూపె ఇహమేపోపరము ॥
కోటిమదనులవంటి గుడిలో చక్కని మూర్తియీటులేని శ్రీ వేంకటేశుడితడు ।వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగకూటువైనన్నేలితి యెక్కువనోనాతాపము ॥
Browse Related Categories: