అన్నమయ్య కీర్తన వినరో భాగ్యము
వినరో భాగ్యము విష్ణుకథవెనుబలమిదివో విష్ణుకథ ॥
ఆది నుండి సంధ్యాది విధులలోవేదంబయినది విష్ణుకథ ।నాదించీనిదె నారదాదులచేవీథి వీథులనే విష్ణుకథ ।
వదలక వేదవ్యాసులు నుడివినవిదిత పావనము విష్ణుకథ ।సదనంబైనది సంకీర్తనయైవెదకినచోటనే విష్ణుకథ ॥
గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగవెల్లి విరియాయె విష్ణుకథ ।ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామమువెల్లగొలిపె నీ విష్ణుకథ ॥
Browse Related Categories: