అన్నమయ్య కీర్తన తిరువీధుల మెఱసీ
తిరువీథుల మెఱసీ దేవదేవుడుగరిమల మించిన సింగారములతోడను ॥
తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడుసిరుల రెండవనాడు శేషునిమీద ।మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రిందపొరినాలుగోనాడు పువు గోవిలలోను ॥
గ్రక్కున నైదవనాడు గరుడునిమీదయెక్కను ఆరవనాడు యేనుగుమీద ॥చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోననుయిక్కువ దేరును గుర్రమెనిమిదోనాడు ॥
కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడుపెనచి పదోనాడు పెండ్లిపీట ।యెనసి శ్రీ వేంకటేశు డింతి యలమేల్^మంగతోవనితల నడుమను వాహనాలమీదను ॥
Browse Related Categories: