అన్నమయ్య కీర్తన శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ । శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ॥
కమలాసతీ ముఖకమల కమలహిత । కమలప్రియ కమలేక్షణ ।కమలాసనహిత గరుడగమన శ్రీ । కమలనాభ నీపదకమలమే శరణు ॥
పరమయోగిజన భాగధేయ శ్రీ । పరమపూరుష పరాత్పరపరమాత్మ పరమాణురూప శ్రీ । తిరువేంకటగిరి దేవ శరణు ॥
Browse Related Categories: