అన్నమయ్య కీర్తన సిరుత నవ్వులవాడు
సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెకా ॥
పొలసు మేనివాడు బోరవీపు వాడు సెలసు మోరవాడు సిన్నెకా ।గొలుసుల వంకల కోరలతోబూమి వెలిసినాడు సూడవే సిన్నెకా ॥
మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి సీటకాలవాడు సిన్నెకా ।ఆటదానిబాసి అడవిలో రాకాశి వేటలాడీ జూడవే సిన్నెకా ॥
బింకపు మోతల పిల్లగోవివాడు సింక సూపులవాడు సిన్నెకా ।కొంకక కలికియై కొసరి కూడె నన్ను వేంకటేశుడు సూడవే సిన్నెకా ॥
Browse Related Categories: