అన్నమయ్య కీర్తన పలుకు తేనెల తల్లి
రాగం: సాళంగనాట
పలుకు దేనెల తల్లి పవళించెను ।కలికి తనముల విభుని గలసినది గాన ॥
నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదరపగలైన దాక జెలి పవళించెను ।తెగని పరిణతులతో తెల్లవారినదాకజగదేక పతి మనసు జట్టి గొనె గాన ॥
కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణిబంగారు మేడపై బవళించెను ।చెంగలువ కనుగొనల సింగారములు దొలకఅంగజ గురునితోడ నలసినదిగాన ॥
మురిపెంపు నటనతో ముత్యాల మలగుపైపరవశంబున దరుణి పవళించెను ।తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసిఅరవిరై నును జెమలు నంటినదిగాన ॥
Browse Related Categories: