అన్నమయ్య కీర్తన నారాయణతే నమో నమో
రాగం: బేహాగ్తాళం: ఆదితాళం
నారాయణతే నమో నమోనారద సన్నుత నమో నమో ॥
మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ ।పరమ పురుష భవబంధ విమోచననర మృగ శరీర నమో నమో ॥
జలధి శయన రవిచంద్ర విలోచనజలరుహ భవనుత చరణయుగ ।బలిబంధన గోప వధూ వల్లభనలినో దరతే నమో నమో ॥
ఆదిదేవ సకలాగమ పూజితయాదవకుల మోహన రూప ।వేదోద్ధర శ్రీ వేంకట నాయకనాద ప్రియతే నమో నమో ॥
Browse Related Categories: