అన్నమయ్య కీర్తన మనుజుడై పుట్టి
మనుజుడై పుట్టి మనుజుని సేవించిఅనుదినమును దుఃఖమందనేలా ॥
జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చిపట్టెడు కూటికై బతిమాలి ।పుట్టిన చోటికే పొరలి మనసువెట్టివట్టి లంపటము వదలనేరడుగాన ॥
అందరిలో పుట్టి అందరిలో చేరిఅందరి రూపములటు తానై ।అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించిఅందరాని పద మందెనటుగాన ॥
Browse Related Categories: