అన్నమయ్య కీర్తన కొలిచిన వారల
కొలిచిన వారల కొంగుపైడితడు । బలిమి తారక బ్రహ్మమీతడు ॥
ఇనవంశాంబుధి నెగసిన తేజము । ఘనయజ్ఞంబుల గల ఫలము ।మనుజరూపమున మనియెడి బ్రహ్మము । నినువుల రఘుకుల నిధానమీతడు ॥
పరమాన్నములోపలి సారపుజవి । పరగినదివిజుల భయహరము ।మరిగినసీతా మంగళసూత్రము । ధరలో రామావతారంబితడు ॥
చకితదానవుల సంహారచక్రము । సకల వనచరుల జయకరము ।వికసితమగు శ్రీవేంకట నిలయము । ప్రకటిత దశరథ భాగ్యంబితడు ॥
Browse Related Categories: