అన్నమయ్య కీర్తన కోడెకాడె వీడె
కోడెకాడె వీడె వీడె గోవిందుడుకూడె ఇద్దరు సతుల గోవిందుడు ॥
గొల్లెతల వలపించె గోవిందుడుకొల్లలాడె వెన్నలు గోవిందుడు ।గుల్ల సంకు~ంజక్రముల గోవిందుడుగొల్లవారింట పెరిగె గోవిందుడు ॥
కోలచే పసులగాచె గోవిందుడుకూలగుమ్మె కంసుని గోవిందుడు ।గోలయై వేల కొండెత్తె గోవిందుడుగూళెపుసతుల~ం దెచ్చె గోవిందుడు ॥
కుందనపు చేలతోడి గోవిందుడుగొందులు సందులు దూరె గోవిందుడు ।కుందని శ్రీవేంకటాద్రి గోవిందుడుగొంది~ం దోసె నసురల గోవిందుడు ॥
Browse Related Categories: