అన్నమయ్య కీర్తన కంటి నఖిలాండ
కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి । కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ॥
మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి । బహు విభవముల మంటపములు గంటి ।సహజ నవరత్న కాంచన వేదికలు గంటి । రహి వహించిన గోపురములవె కంటి ॥
పావనంబైన పాపవినాశము గంటి । కైవశంబగు గగన గంగ గంటి ।దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి । కోవిదులు గొనియాడు కోనేరి గంటి ॥
పరమ యోగీంద్రులకు భావగోచరమైన । సరిలేని పాదాంబుజముల గంటి ।తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి । తిరు వేంకటాచలాధిపు జూడగంటి ॥
Browse Related Categories: