అన్నమయ్య కీర్తన జయ లక్ష్మి వర లక్ష్మి
రాగం: లలిత
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ।ప్రియురాలవై హరికి~ం బెరసితివమ్మా ॥
పాలజలనిధిలోని పసనైనమీ~ంగడమేలిమితామరలోని మించువాసన ।నీలవర్ణునురముపై నిండిననిధానమవైయేలేవు లోకములు మమ్మేలవమ్మా ॥
చందురుతోడ~ం బుట్టిన సంపదలమెఱు~ంగవోకందువ బ్రహ్మల~ం గాచేకల్పవల్లి ।అందినగోవిందునికి అండనే తోడునీడవైవుందానవు మా^^ఇంటనే వుండవమ్మా ॥
పదియారువన్నెలతో బంగారుపతిమచెదరనివేదములచిగురు~ంబోడి ।యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవునిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ॥
Browse Related Categories: