అన్నమయ్య కీర్తన జయ జయ రామా
జయ జయ రామా సమరవిజయ రామా ।భయహర నిజభక్తపారీణ రామా ॥
జలధిబంధించిన సౌమిత్రిరామాసెలవిల్లువిరచినసీతారామా ।అలసుగ్రీవునేలినాయోధ్యరామాకలిగి యజ్ఞముగాచేకౌసల్యరామా ॥
అరిరావణాంతక ఆదిత్యకులరామాగురుమౌనులను గానేకోదండరామా ।ధర నహల్యపాలిటిదశరథరామాహరురాణినుతులలోకాభిరామా ॥
అతిప్రతాపముల మాయామృగాంతక రామాసుతకుశలవప్రియ సుగుణ రామా ।వితతమహిమలశ్రీవేంకటాద్రిరామామతిలోనబాయనిమనువంశరామా ॥
Browse Related Categories: