సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు । సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు ॥
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆవల భాగీరధి దరి వాగుల ఆ జలమే ఊరినయట్లు । శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని ఈవలనే నీ శరణని ఎదను, ఇదియే పరతత్వము నాకు ॥