అన్నమయ్య కీర్తన ఎక్కువ కులజుడైన
ఎక్కువ కులజుడైన హీన కులజుడైననిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ॥
వేదములు చదివియును విముఖుడై హరిభక్తి యాదరించని సోమయాజి కంటె ।ఏదియును లేని కుల హీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు ॥
పరమ మగు వేదాంత పఠన దొరికియు సదా హరి భక్తి లేని సన్యాసి కంటె ।సరవి మాలిన అంత్య జాతి కులజుడైననరసి విష్ణుని వెదకు నాతడే ఘనుడు ॥
వినియు చదివియు, శ్రీ విభుని దాసుడు గాకతనువు వేపుచు నుండు తపసి కంటె ।ఎనలేని తిరు వేంకటేశు ప్రసాదాన్నమనుభవించిన యాతడప్పుడే ఘనుడు ॥
Browse Related Categories: