అన్నమయ్య కీర్తన దేవ దేవం భజే
రాగం: ధన్నాసి
దేవ దేవం భజే దివ్యప్రభావం ।రావణాసురవైరి రణపుంగవం ॥
రాజవరశేఖరం రవికులసుధాకరంఆజానుబాహు నీలాభ్రకాయం ।రాజారి కోదండ రాజ దీక్షాగురుంరాజీవలోచనం రామచంద్రం ॥
నీలజీమూత సన్నిభశరీరం ఘనవి-శాలవక్షం విమల జలజనాభం ।తాలాహినగహరం ధర్మసంస్థాపనంభూలలనాధిపం భోగిశయనం ॥
పంకజాసనవినుత పరమనారాయణంశంకరార్జిత జనక చాపదళనం ।లంకా విశోషణం లాలితవిభీషణంవెంకటేశం సాధు విబుధ వినుతం ॥
Browse Related Categories: