అన్నమయ్య కీర్తన చేరి యశోదకు
చేరి యశోదకు శిశు వితడుధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు ॥
సొలసి చూచినను సూర్యచంద్రులనులలి వెదచల్లెడులక్షణుడు ।నిలిచిననిలువున నిఖిలదేవతలకలిగించు సురలగనివో యితడు ॥
మాటలాడినను మరియజాండములుకోటులు వోడమేటిగుణరాశి ।నీటగునూర్పుల నిఖిలవేదములుచాటువనూ రేటిసముద్ర మితడు ॥
ముంగిట జొలసిన మోహన మాత్మలబొంగించేఘనపురుషుడు ।సంగతి మావంటిశరణాగతులకునంగము శ్రీవేంకటాధిపు డితడు ॥
Browse Related Categories: