This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.
అన్నమయ్య కీర్తన అన్ని మంత్రములు
అన్ని మంత్రములు నిందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము ॥
నారదుండు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము ।
కోరి విభీషణుండు చేకొనె రామ మంత్రము
వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము ॥
రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుండు జపియించె
నంగ వింవె కృష్ణ మంత్ర మర్జునుండును ।
ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠించె
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము ॥
ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరా నాధుండె గురి
పన్నిన దిదియె పర బ్రహ్మ మంత్రము ।
నన్నుగావ కలిగె బో నాకు గురు డియ్యగాను
వెన్నెల వంటిది శ్రీ వేంకటేశు మంత్రము ॥