View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

అన్నమయ్య కీర్తన అదివో అల్లదివో

రాగం: మధ్యమావతి

అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము ॥

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము ।
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడు డదె మొక్కు డానందమయము ॥

చెంగట నదివో శేషాచలమూ
నింగి నున్న దేవతల నిజవాసము ।
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ॥

కైవల్య పదము వేంకట నగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది ।
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావన మయమూ ॥







Browse Related Categories: